వనపర్తి జిల్లా కొత్తకోటలోని విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 13 రోజుల పాటు పూజలందుకున్న గణేశుడి నిమజ్జనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 100 మంది వాయిద్యకారులచే చేయించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభా యాత్రలో మహిళలంతా ఒకే రకమైన వస్త్రధారణతో చేసిన నృత్యాలు, కోలాట ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండిః చంద్రయాన్-2: ఆఖరి క్షణంలో 'విక్రమ్'కు ఏమైంది?