తెలంగాణ సర్కారు నిర్వహిస్తున్న ఇన్నోవేషన్ యాత్ర-2020లో భాగంగా... ఎంపికైన విద్యార్థుల బృందం వనపర్తి జిల్లా నందిమల్లగడ్డ మెట్టుపల్లిలో పర్యటించింది. రైతు సమస్యలు, ఆవిష్కరణలపై విద్యార్థులు రైతులతో చర్చించారు. పలు విభాగాలకు చెందిన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి ఇన్నోవేషన్ యాత్రకు శ్రీకారం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రతిభావంతులైన 120 మంది విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజించారు. నాలుగురోజుల పాటు పలు జిల్లాల్లో నాలుగు వేల కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నారు. గద్వాల-వనపర్తి-మహబూబ్‌నగర్, వరంగల్-కరీంనగర్-సిద్దిపేట, ఖమ్మం-నల్గొండ, ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ జిల్లాల్లో పర్యటన కొనసాగనుంది. నాలుగు రోజుల అనంతరం ఈ బృందాలు హైదరాబాద్ టీ-హబ్‌కు చేరుకోనున్నాయి.
ఇవీ చూడండి: మహిళల భద్రతే ప్రథమ లక్ష్యం: సజ్జనార్