వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా, డెంగ్యూ తదితర అంశాలపై సమీక్షించారు. లాక్డౌన్ నేపథ్యంలో బయటకు వచ్చే ప్రజలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈనెలాఖరు వరకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ఇప్పటివరకు జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదన్నారు. విదేశాలు, మర్కజ్ నుంచి వచ్చిన వారందరికీ రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందన్నారు. అమరచింత, వనపర్తి పట్టణాల్లో డెంగ్యూ కేసులు నమోదైనందున జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయితీల్లో ఒకరోజు డ్రైడే నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు. హోమ్ క్వారైంటైన్లో ఉన్నవారికి చికిత్స అందిస్తున్న ప్రత్యేక బృందాలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ట్యాబ్లెట్లను వేయించాలని డీఎంహెచ్ఓకు కలెక్టర్ సూచించారు.
ఇదీ చూడండి : వికారాబాద్ జిల్లాలో మరో 11 మందికి పాజిటివ్