గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కాసింనగర్ గ్రామంలో పర్యటించిన ఆయన అక్కడ నిర్మించిన రైతువేదిక, స్మశాన వాటికను ప్రారంభించారు.
రైతులు తమ సమస్యలను చర్చించుకునేందుకు రైతువేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో వ్యవసాయ భూమి లేనివారు మరణించిన తరువాత ఖననం చేయడానికి సీఎం కేసీఆర్ శ్మశానవాటికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండి పరిష్కరించాలని సూచించారు.
ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచే ప్రైవేటు టీచర్లకు సాయం