స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా జాతీయ నాయకుల చిత్రపటాలకు వందన సమర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మంత్రి వివరించారు. అనంతరం పలువురికి రాయితీ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. జిల్లాలోని పలు మండలాల్లోని మహిళా సంఘాల సభ్యులకు మంజూరైన రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో ఉత్సాహంగా స్వాతంత్య్ర వేడుకలు