Mandakrishna Madiga: రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అవసరమైతే సీఎం కేసీఆర్‌ను గద్దె దించేదాకా నిద్రపోయేది లేదన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నిరసన ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం గద్వాల పట్టణంలోని అంబేడ్కర్ చౌక్‌లో ఉన్న విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కృష్ణవేణి చౌక్‌లో ఉన్న టీఎన్జీవో భవనంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకుంటానని ప్రమాణం స్వీకారం చేసిన కేసీఆర్.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో జాతీయ స్థాయిలో నాయకులతో కలిసి యుద్ధభేరి సభను ఏర్పాటు చేస్తామన్నారు. యుద్ధభేరి సభ వివరాలను ఈ నెల 15న ప్రకటిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తాడోపేడో తేల్చుకునేందుకే యుద్ధభేరి ఏర్పాటు చేస్తున్నామని మంద కృష్ణమాదిగ అన్నారు.
ఇదీ చదవండి: