వనపర్తి జిల్లా వీపన గండ్ల మండల కేంద్రంలో వైన్ షాప్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వీపన్నగండ్ల పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అధిక రేటుకు అమ్మి లాభం పొందాలనే ఉద్దేశంతోనే అక్రమ మద్యం తరలిస్తున్నారని అబ్కారీ సీఐ ఓంకార్ అన్నారు. ప్రభుత్వం ధరల ప్రకారం దాదాపు రూ 4.36 లక్షలు విలువ గల మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సరకును మద్యం ప్రియులకు విక్రయించి ఉంటే రూ. 20 లక్షల పైన లాభం వచ్చేదని సమాచారం. పోలీసులు చాకచక్యంతో వ్యవహరించి అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ స్పష్టం చేశారు.