వనపర్తి జిల్లా చిన్న మందడిలో గ్రామ సర్పంచ్ సూర్యచంద్రారెడ్డి సమక్షంలో యశోద స్వచ్చంద సంస్థ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. ఊళ్లో ఉన్న గర్బిణీ, బాలింతలు, చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి రోజూ అర కిలో కూరగాయలతో పాటు వారికి కావలసిన మందులను ఉచితంగా పంపిణీ చేస్తారని గ్రామ సర్పంచ్ తెలిపారు. వీటి వల్ల రక్తహీనత తదితర సమస్యలను అధిగమించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
ఉచిత వైద్యం..
సంస్థ ఆధ్వర్యంలో సంవత్సరం లోపు చిన్నారులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. చిన్నారులకు ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే యశోద స్వచ్చంద సంస్థ ఉచితంగా వైద్యం చేస్తామని హామీ ఇచ్చింది. కార్యక్రమానికి వందేమాతరం ఫౌండేషన్ సమన్వయకర్త మాధవరెడ్డి హాజరై గ్రామంలోని గర్బిణీ, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
ఇవీ చూడండి:స్థానిక సమరానికి సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం