వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలో ఉన్న సరళాసాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. జలాశయం నిండడం వల్ల సైఫాన్స్ తెరచి నీటిని కిందికి వదిలారు. దీంతో ఆత్మకూర్, మదనాపురం రోడ్డుపైకి నీరు చేరి ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామన్‌పాడ్ ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తడం వల్ల గేట్లను తెరిచి ఊకచెట్టు వాగుకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి: వ్యవసాయ బిల్లుల ఆమోదంతో యార్డుల పాత్ర నామమాత్రం