ప్రజలకు రక్షణ కల్పించడం కోసమే కట్టడి ముట్టడి నిర్వహించామని వనపర్తి డీఎస్పీ కిరణ్కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా కాలనీలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.
ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులు, ఇతర ధ్రువపత్రాలు పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్రవాహనాలు, ఒక కారు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
సరైన ధ్రువపత్రాలు చూపించి జప్తు చేసిన వాహనాలను తీసుకెళ్లవచ్చునని డీఎస్పీ కిరణ్కుమార్ తెలిపారు.
- ఇదీ చూడండి : ఆర్టీసీ భవితవ్యం: త్వరలో ప్రైవేటు నోటిఫికేషన్