నూతన కలెక్టర్ కార్యాలయ భవనాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వనపర్తి జిల్లా పాలానాధికారి షేక్ యాస్మిన్ బాషా అధికారులకు సూచించారు. కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఎలివేషన్, పూల మొక్కలు, లాన్ తదితర విషయాలపై ప్రణాళిక ప్రకారం సుందరీకరణ పనులను చేపట్టాల్సిందిగా ఆదేశించారు.
దీనికి సంబంధించిన అంచనాలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ అన్నారు. పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తయారుచేసి పూర్తి వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా మొజార్ల ఉద్యాన కళాశాల ప్రిన్సిపల్ డా.గీర్వాణిని ఆదేశించారు.
సుందరీకరణ విషయమై తనిఖీలు చేశారు. నూతన కలెక్టర్ కార్యాలయంలో చేపట్టాల్సిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులన్నీ పూర్తయిన తర్వాత మొక్కల పెంపకం, లాన్ ఏర్పాటు వంటివి చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. రూఫ్ గార్డెన్ ఏర్పాటుకు, నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ లైన్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: వరదసాయంలో గోల్మాల్.. అందలేదంటున్న లబ్ధిదారులు