రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్లలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పర్యటించారు. వీధుల్లో తిరిగి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. మొదటి విడతలో చేపట్టిన కార్యక్రమాలు, రెండో విడతలో చేపట్టనున్న కార్యక్రమాలపై గ్రామ సర్పంచ్, కార్యదర్శులను ఆరా తీశారు.
గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, పన్ను చెల్లింపులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డును పరిశీలించి, పూర్తి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజినీర్‌కు షోకాజ్ నోటీసు జారీచేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రామ శివారులో శ్మశాన వాటిక నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు.
ఇదీ చూడండి:నెలాఖరులో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు?