ETV Bharat / state

వనపర్తిలో కరోనా వ్యాప్తి నివారణకు.. రసాయనాల పిచికారి!

author img

By

Published : Jul 18, 2020, 8:37 PM IST

రోజురోజుకు జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్నందున వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజా ప్రతినిధులు ముందు జాగ్రత్త చర్య్లలు తీసుకుంటున్నారు. కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు తమ తమ వార్డుల్లో రసాయనాలు పిచికారి చేయిస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో అధికారులు రసాయనాలు పిచికారి చేయించారు.

Chemicals Spray in Wanaparthy District
వనపర్తిలో కరోనా వ్యాప్తి నివారణకు.. రసాయనాల పిచికారి!

వనపర్తి జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నందున పట్టణంలోని కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు వారి వారి వార్డులో రసాయనాలు పిచికారి చేస్తున్నారు. వనపర్తి డిపో నుంచి హైదరాబాద్, కర్నూల్ జిల్లాలకు తిరుగుతున్న బస్సులను పూర్తిగా శానిటైజ్​ చేస్తున్నారు. డిపో నుండి వైరస్ ఇతర గ్రామాలకు ఎక్కువగా వ్యాప్తి కాకూడదన్న ఆలోచనతో సర్వీసులో ఉన్న ప్రతి బస్సును శానిటైజ్​ చేస్తున్నట్టు స్థానిక నాయకులు తెలిపారు.

వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 147 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 70 కేసులు పట్టణంలోనే నమోదయ్యాయి. పట్టణంలోనే కరోనా కేసులు ఎక్కువగా ఉండడం వల్ల పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరూ అత్యవసర అయితే తప్ప బయటకు రావద్దని, మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి: 35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.