ఈ నెల 14 నుంచి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల బండవేల్కిచర్ల గ్రామ పరిధిలోని పాంబండ శ్రీ రామలింగేశ్వర జాతరను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. జాతరకు సంబంధించిన గోడపత్రికను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆవిష్కరించారు.
జాతరకు వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యవర్గం వెల్లడించింది. కార్యక్రమంలో ఈవో సుధాకర్, ఆలయ ఛైర్మన్ రాములు, ఎంపీపీ సత్యమ్మ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కమిటీ ఏర్పాటు