అధైర్య పడకుండా సరైన సమయంలో చికిత్స తీసుకుంటే కరోనాను జయించవచ్చని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సాయి డెంటల్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్, మహావీర్ ఐసోలేషన్ వార్డులను ఎమ్మెల్యే సందర్శించారు.
స్వయంగా డాక్టర్ అయిన ఎమ్మెల్యే.. చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి హార్ట్ బీట్, పల్స్ రేట్‌ను పరిశీలించారు. అదే వార్డులో చికిత్స పొందుతున్న ఓ పత్రికా విలేకరితో మాట్లాడారు. బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అందరూ రెండు మాస్కులు ధరించాలని సుచించారు.
ఇదీ చూడండి: అకాల వర్షానికి తడిసిముద్దయిన ధాన్యం