వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో ప్లాగథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్యలు జెండా ఊపి ప్రారంభించారు. అటవీ, మున్సిపల్ శాఖలతో పాటు వికారాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్లాగథాన్ జరిగింది.
వాకర్స్ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడి చెత్తను ఏరివేశారు. తెలంగాణ ఊటీగా పేరుగాంచిన అనంతగిరిలో పర్యటకులు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని వారు కోరారు. పర్యటక ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా అటవీ, మున్సిపల్ అధికారులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు.
- ఇదీ చూడండి : పాతవే కానీ.. కొత్తగా రోడ్డెక్కుతున్నాయి!