ప్రమాదానికి గురైన ఓ గుర్తు తెలియని వ్యక్తిని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ రక్షించారు. వికారాబాద్ పట్టణంలో కొండా బాలకృష్ణరెడ్డి గార్డెన్ ముందు గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదే రోడ్ మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్... ఆ వ్యక్తిని గమనించి... తన వాహనం దిగి ప్రమాదం జరిగిన వ్యక్తి వద్దకు వెళ్లారు.
అపస్మారకస్థితిలో ఉన్న ఆ వ్యక్తికి ఎమ్మెల్యే ఆనంద్ వెంటనే సీపీఆర్(కార్డియో పల్మనరీ సిసోసిటేషన్) చికిత్స అందించారు. ఆ వ్యక్తి నాడి కొట్టుకోవడం ప్రారంభమైంది. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతనికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఇదీ చదవండి : కొవాగ్జిన్ టీకా తీసుకున్న కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డి