ETV Bharat / state

తాండూరు ఆస్పత్రిలో వెంటిలేటర్లు నిరుపయోగం - తెలంగాణ వార్తలు

వికారాబాద్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వారిలో కొందరికి వెంటిలేటర్ చికిత్స అవసరం అవుతుంది. వైద్యం కోసం హైదరాబాద్​కు వెళ్లాల్సి వస్తోంది. ఎంసీహెచ్‌ వద్ద ఉన్న ఆక్సిజన్‌ ప్లాంటుతో పాటు జిల్లా ఆస్పత్రిలోని వెంటిలేటర్లను వినియోగంలోకి తీసుకువస్తే ఆక్సిజన్‌ కోసం బాధితులు హైదరాబాద్‌ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ విషయమై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే ప్రయోజనముంటుంది.

Ventilators in Tandur Hospital are useless, thandur hospital
నిరూపయోగంగా వెంటిలేటర్లు, తాండూరు ప్రభుత్వ ఆస్పత్రి
author img

By

Published : May 4, 2021, 9:49 AM IST

వికారాబాద్ జిల్లా తాండూరులో రోజూ 200 మంది వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. వారిలో కనీసం 30 నుంచి 50 మంది దాకా పాజిటివ్‌గా తేలుతోంది. వారిలో కొందరు జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతుంటే మరి కొందరు ఇళ్లలోనే ఉండి వైద్య సేవలు పొందుతున్నారు. ఇంకొందరు అత్యవసర వైద్యానికి హైదరాబాద్‌ వెళ్తున్నారు. ఎంసీహెచ్‌ వద్ద ఉన్న ఆక్సిజన్‌ ప్లాంటుతో పాటు జిల్లా ఆస్పత్రిలోని వెంటిలేటర్లను వినియోగంలోకి తీసుకువస్తే ఆక్సిజన్‌ కోసం బాధితులు హైదరాబాద్‌ వెళ్లాల్సిన అవసరం ఉండదు. కరోనా బాధితులకు జిల్లాలోనే సౌకర్యాలు ఉన్నాయని, హైదరాబాద్‌ వెళ్లాల్సిన అవసరం లేదని స్వయంగా మంత్రి సబితారెడ్డి ప్రకటించారు. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.

గతేడాది వచ్చినా..:

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తిచెందుతోంది. వెంటిలేటర్‌ అవసరమున్న వారు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కరోనా బాధితులకు అవసరమవుతాయనే ఉద్దేశంతో జాతీయ ఆరోగ్య మిషన్‌ కిందట గతేడాది 10 వెంటిలేటర్లు ఆస్పత్రికి పంపినా సిబ్బంది లేరని చెబుతూ వాటిని నిరుపయోగంగా ఉంచారు. ఇప్పటికే జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ కేంద్రంలో బాధితులు చికిత్స పొందుతున్నారు. వాళ్లకు అత్యవసరమైతే వెంటిలేటర్లు ఉన్నా ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. వీటిని వినియోగంలోకి తేవాలంటే ఐసీయూ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చి, తక్షణం సిబ్బందిని నియమించాలి. ఈ విషయమై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే ప్రయోజనముంటుంది. ఇలా చేస్తే ప్రైవేటులో రూ.వేలు వెచ్చించి ఆర్థికంగా చితికిపోకుండా వైరస్‌ బారిన పడిన వారికి ఊరట కలుగుతుంది.

మాతా, శిశు సంరక్షణ కేంద్రం వద్ద:

పట్టణ శివారులో రూ.15 కోట్లతో మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించారు. ఇక్కడే 13వేల కిలోలీటర్లు సామర్థ్యం ఉన్న ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ప్రారంభం కాకపోవటంతో ప్లాంటు సైతం ఇంకా వినియోగంలోకి రాలేదు. అక్కడ కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ వాయువు అవసరం అయితే ఇబ్బందులు ఎదురు కాకుండా ముందుగానే ఆక్సిజన్‌ ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరముంది.

కరోనా మహమ్మారితో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మొన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వేల మంది ప్రాణవాయువు అందక తల్లడిల్లారు. ఊపిరి ఆడక కొంత మంది మృతిచెందారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించడంతో ఉపశమనం లభించింది. శ్వాస తీసుకోలేని విషమ పరిస్థితుల్లో కృత్రిమంగా అందించేందుకు వెంటిలేటర్లు ఉపయోగిస్తారు. మరో వైపు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడే వారికి సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ అందిస్తారు. ఇలా అత్యవసర పరిస్థితిలో వినియోగించేందుకు ఆక్సిజన్‌ ప్లాంటు, వెంటిలేటర్లు తాండూరులో ఉన్నప్పటికీ వినియోగించడంలేదు. ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్‌ అవసరమున్న వారి నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ తాండూరు జిల్లా ఆస్పత్రిలో మాత్రం వెంటిలేటర్లను గదిలో దాచిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఐసీయూ కేంద్రం లేకపోవడం వల్లే..
ఆస్పత్రిలో ఐసీయూ కేంద్రం అందుబాటులో లేకపోవటంతో వెంటిలేటర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతున్నాం. ఈ కేంద్రం ఉంటే ఆక్సిజన్‌ సరఫరా పైపు లైన్లు, ప్రత్యేక మంచాలు ఉంటాయి. ఆస్పత్రిలో ఆరు వెంటిలేటర్లు ఉండగా, మూడు ప్రత్యేక వార్డుల్లో వాడుతున్నాం. ప్రస్తుతం కొవిడ్‌ బాధితులకు సిలిండర్ల ద్వారా ప్రాణ వాయువును అందిస్తున్నాం. మాతా, శిశు సంరక్షణ కేంద్రం వద్ద ఉన్న ఆక్సిజన్‌ ట్యాంకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఎంసీహెచ్‌ కేంద్రం ప్రారంభమైన తర్వాతే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది.

-డాక్టరు మల్లికార్జున స్వామి, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకులు, తాండూరు

ఇదీ చదవండి: రేషన్‌ పంపిణీకి బయోమెట్రిక్ భయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.