వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్... కింది స్థాయి ఉద్యోగి నాగేందర్ పట్ల అనుచితంగా ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారు. అనిల్ కుమార్ తీరును నిరసిస్తూ ఉద్యోగులు విధులను బహిష్కరించి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనవసరంగా తమకు తాఖీదు జారీ చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమపట్ల దురుసుగా వ్యవహరించిన అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అక్కడికి వచ్చిన పురపాలక కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. మీరు నిరసన విరమించండి... అతనిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ నచ్చజెప్పారు. ఉద్యోగులు కమిషనర్‌కు వినతి పత్రం అందజేసి ఆందోళన విమరించారు.
ఇదీ చూడండి: పారిశుద్ధ్య లోపం.. పొంచి ఉంది అనారోగ్యం