వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరికి పాల్పడ్డారు.ఒకేసారి మూడు ఇళ్లల్లో చోరికి పాల్పడ్డారు. దాదాపు 45వేల రూపాయల నగదు, 15 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. స్థానికులు ఇంటి యజమానులకుసమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:హైకోర్టు జడ్జిపై సీబీఐ విచారణ.. దేశంలోనే తొలిసారి!