వికారాబాద్ రైల్వే స్టేషన్లో సౌకర్యాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్య పరిశీలించారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లో ఆయన వికారాబాద్ వచ్చారు. రైల్వేస్టేషన్, ఆస్పత్రి, కమ్యునిటీహాల్ను పరిశీలించారు. రైల్వే జీఎంను స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ కలిసారు. స్టేషన్ పరిసరాల్లో ఫ్లైఓవర్ వంతెనలు నిర్మించాలని విన్నవించారు. కోణార్క్, గరీబ్‌రథ్ రైళ్లు ఆపాలని, ఎంఎంటీస్ సౌకర్యాన్ని వికారాబాద్ వరకూ పొడిగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. స్థానిక ప్రాంతాలకు చెందిన రైతులు తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి లేదని కోరగా అక్కడ వంతెన ఎత్తు పెంచి దారి కల్పిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి: బస్సు మొరాయించింది... డీఎస్పీ ఆదరించారు