వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ శివారు ప్రాంతంలో మూసివేసిన రైల్వే అండర్ బ్రిడ్జిని తెరవాలని తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సందర్భంలో ఎంపీ జోక్యం చేసుకొని ఆర్యూబీ రోడ్డును తెరవాలని విజ్ఞప్తి చేశారు.
స్థానిక రైల్వే అధికారులు ఇటీవల ఆర్యూబీ మార్గం మూసివేయడంతో పశువులు, జీవాలను మేపుకునే వారు దాదాపు 5 కిలోమీటర్లు అదనపు దూరం వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఎంపీ దృష్టికి గతంలో తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే మూసివేసిన బ్రిడ్జిని తిరిగి తెరావాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: టేక్రియాల్ కేజీబీవీలో కరోనా కలకలం... 32 మందికి పాజిటివ్