ETV Bharat / state

అధికారులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే ఆనంద్‌

author img

By

Published : Sep 1, 2020, 1:01 PM IST

వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పాల్గొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యే శ్రద్ధ వహించాలని సూచించారు.

mla methuku anand
mla methuku anand

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులందరూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ సూచించారు. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యే శ్రద్ధ వహించాలని మెతుకు ఆనంద్ పేర్కొన్నారు.

బీరోల్‌ గ్రామానికి వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఎంపీటీసీలు, సర్పంచులు కోరగా త్వరలోనే అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. పశు వైద్య సిబ్బంది సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని ఎంపీడీఓ లక్ష్మీనారాయణను ప్రశ్నించగా సమాచారం ఇచ్చినా హాజరు కాలేదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు సుందరి అనిల్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్‌ యాదవ్‌, సర్పంచులు విజయలక్ష్మి, మల్లేశం, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.