ETV Bharat / state

సొంతూరిలో సాగుబాట.. వ్యవసాయ పనులకు తగ్గిన కూలీల కొరత - వలస కూలీల ఉపాధి

కరోనా విజృంభణలతో సొంతూళ్లకు వచ్చిన వారు ఉపాధి హామీ, వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. లాక్‌డౌన్ విధించిన తొలిరోజుల్లో ఇబ్బందులు పడ్డ వారంతా ఇప్పడు పనులకు వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చేస్తుండడంతో కూలీల కొరత తగ్గింది. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో మరో నెలరోజులదాకా పనులకు ఢోకా ఉండదని భావిస్తున్నారు.

migrants coolies
migrants coolies
author img

By

Published : Jul 12, 2020, 12:25 PM IST

కొవిడ్‌ సంక్షోభం వల్ల గ్రామాల్లో కొత్త దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి పల్లెలను వదిలి పట్టణాలు, నగరాలకు వలస వెళ్లి ఉపాధి పొందుతున్న పలు కుటుంబాలు ఇప్పుడు వెనక్కి వచ్చి వ్యవసాయం చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో రాజధానిలో పనులు దొరక్క పడిన కష్టాలు చాలా మందిని ఆలోచింపజేశాయి. కరోనా భయంతో సొంతూళ్లకు వెళ్లిన వారు అక్కడే పనులు వెదుక్కోసాగారు. కాస్తో కూస్తో పొలం ఉన్నవారు సొంతంగా సాగుకు ఉపక్రమించారు.

గతేడాది వరకు వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే సమయంలో కూలీలకు డిమాండు, కొరత పెరిగి రైతులు ఇబ్బందులు పడేవారు. ఈ వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో వర్షాలు మొదలైన నెలరోజుల్లోనే ఏకంగా 63 లక్షల ఎకరాల పంటలు సాగయినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈ నెలాఖరుకల్లా కోటి ఎకరాలకు పైగా పంటలు సాగవుతాయని తాజా అంచనా. అయినా గ్రామాల్లో పెద్దగా కూలీల కొరత లేదు. విద్యాసంస్థలన్నీ మూతపడటంతో వాటిలో చదివే పిల్లలంతా తల్లిదండ్రులతో కలిసి సొంత పొలంలో లేదా ఇతర చోట్లకు కూలీకి వెళుతున్నారు. మరో నెలరోజులదాకా పనులకు ఢోకా ఉండదని భావిస్తున్నట్లు మెదక్‌ జిల్లా చేగుంటకు చెందిన కూలీలు తెలిపారు.

పట్నం నుంచి పల్లెకు...

ఈయన పేరు కెతావత్‌ రాంజీ. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం బానాల స్వగ్రామం. సొంత ఊరిలో ఆరెకరాల భూమి ఉంది. గత ఏడాది వరకు భూమిని కౌలుకు ఇచ్చి హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులంతా కూలి పనులు చేసేవారు. కరోనా నేపథ్యంలో వీరంతా మళ్లీ స్వగ్రామానికి వచ్చేశారు. 'మా ఊళ్లోనే పొలం సాగుచేసుకుంటున్నాం. కుటుంబంతో పాటు పనులు చేసుకుంటున్నందున కూలీల అవసరం తగ్గింది. గతంలో కూలీలు దొరక్క, వెదుక్కోలేక వ్యవసాయం మానేశాను. ఈ సీజన్‌లో ఆ సమస్య లేదు’' అని తెలిపారు రాంజీ.

ముంబయి నుంచి వచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నాం

మూడేళ్ల క్రితం ముంబయి వలస వెళ్లి అడ్డాకూలీగా పనిచేసేవాడిని. అక్కడ రోజుకు రూ.1200 నుంచి రూ.1300 దాకా కూలీ వచ్చేది. లాక్‌డౌన్‌లో స్వగ్రామానికి వచ్చా. ఉదయం ఉపాధి హామీ పనులకు వెళుతున్నాం. మధ్యాహ్నం నుంచి వ్యవసాయ పనులకు వెళ్తున్నాం. కూలీ రోజుకు ఐదారు వందలు వస్తోంది.

- రాములునాయక్‌, వాల్యానాయక్‌ తండా, వికారాబాద్‌ జిల్లా

లాక్‌డౌన్‌లో స్వగ్రామానికి వచ్చేశాం

ఏడేళ్ల క్రితం ఉపాధి కోసం పుణెకు వలస వెళ్లాం. రోజుకు రూ..1000 దాకా కూలీ వచ్చేది. లాక్‌డౌన్‌లో స్వగ్రామానికి వచ్చేశాం. వ్యవసాయ పనులతో పాటు నిర్మాణ పనులకు వెళ్తున్నాం.

- ఏమ్లా నాయక్‌, టాకీతాండా, బషీరాబాద్‌ మండలం, వికారాబాద్‌ జిల్లా

ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.