ETV Bharat / state

పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు: హెచ్​ఆర్సీలో రైతులు - మంజారాం రైతుల తాజా వార్తలు

అధికార పార్టీకి చెందిన సర్పంచ్, అతని అనుచరులు తమపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని పలువురు రైతులు హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. 11 మంది దాడి చేస్తే ముగ్గురిపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.

'పోలీసులు ముగ్గురిపై కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారు'

author img

By

Published : Jul 4, 2020, 4:37 PM IST

వికారాబాద్‌ జిల్లా నవాబ్‌ పేట్‌ పోలీసులు పక్షపాతంగా వ్వవహరిస్తున్నారని రైతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. మంజారాంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అడవి పందుల బెడదతో రాత్రిపూట పొలం వద్ద కాపాల కాస్తున్నట్లు కమిషన్‌కు వివరించారు.

రాత్రిపూట పొలం వద్దకు వచ్చిన మంజారాం గ్రామ సర్పంచ్‌... అతని అనుచరులు మద్యం సేవించిన సీసాలను అక్కడే పగులగొట్టారని అన్నదాతలు పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించినందుకు 11మంది తమపై మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని ఆరోపించారు.

వారిపై చర్యలు తీసుకోవాలని.. నవాబ్ పేట్ పీఎస్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ.. పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురిపైనే కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారని తెలిపారు.

తక్షణమే అందరిపై కేసులు నమోదు చేయడంతోపాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీని కోరారు.

ఇదీ చూడండి: బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.