ETV Bharat / state

ఉద్యాన పంటలకు ఊతమేదీ..?

వికారాబాద్​ జిల్లాలో ఉద్యాన పంటలైన పండ్లు, కూరగాయల సాగుతో అదనపు ఆదాయం సమకూరుతోంది. వీటిని అత్యధికంగా పండించాలని ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్నా.. సలహాలు, సూచనలు అందించే వారు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి భరోసా ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. కొత్త నియామకాలు లేకుండానే ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. అంతేకాకుండా పొరుగు సేవల క్షేత్ర స్థాయి సిబ్బందిని ఈనెల ఒకటో తేదీ నుంచి తొలగించారు. ఈ పరిణామంతో మూలిగేనక్కపై తాటిపండు పడిన చందంగా మారింది.

Vikarabad District horticultural cultivate latest news

author img

By

Published : May 17, 2020, 9:51 AM IST

వికారాబాద్​ జిల్లాలో వికారాబాద్‌, ధారూరు, నవాబుపేట, మర్పల్లి, మోమిన్‌పేట, పూడూరు, పరిగి, దోమ, కుల్కచర్ల, పెద్దేముల్‌, బషీరాబాద్‌, తాండూరు, యాలాల, కొడంగల్‌, బొంరాస్‌పేట మండలాల్లో పదివేల మందికిపైగా రైతులు సుమారు 20వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూలను సాగు చేస్తున్నారు. వీరు పండించిన ఉత్పత్తులను జిల్లాలోని ప్రధాన పట్టణాలైన తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌లో జరిగే సంతల్లో విక్రయిస్తుంటారు.

వికారాబాద్‌, పరిగి నియోజకవర్గాల్లోని రైతులు ఇక్కడి నుంచే హైదరాబాద్‌కు తరలిస్తారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పండ్లు, కూరగాయల సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉండగా అందుకు ప్రోత్సాహం అందడం లేదు. జిల్లాలో 2వేలకుపైగా ఎకరాల్లో ఉల్లి పండించే రైతులు ఉండగా వీరికి ఏటా 33, 50 శాతం రాయితీపై విత్తనాలను సరఫరా చేసేవారు. మూడేళ్లుగా వీటిని ఇవ్వడంలేదు.

కూరగాయల సాగును విస్తరించేందుకు కొంతమంది రైతులకు ఉచితంగా విత్తన పొట్లాలను అందించే వారు. వాటి జాడలేకుండా పోవడం వల్ల గత్యంతరంలేక బహిరంగ విపణిలో కొనక తప్పడం లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రారంభించిన యాంత్రీకరణ పథకానికి అరకొర నిధులతో సరిపెడుతుండటంతో రైతులు పాతపద్ధతుల్లోనే ముందుకు సాగుతున్నారు.

ఐదుగురు ఉద్యోగులు... పద్దెనిమిది మండలాలు...

ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలు ఇచ్చే వారు లేకపోవడం వల్ల అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలోని పద్దెనిమిది మండలాల్లో శాశ్వత ఉద్యోగులతో కలిపి 12మంది క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. పొరుగు సేవల పద్ధతిలో పని చేస్తున్న ఇద్దరు విస్తరణ అధికారులు, ఐదుగురు సూక్ష్మ సేద్య విస్తరణ అధికారులను తొలగించారు.

వీరంతా రెండుమూడు మండలాలకు ఒకరు చొప్పున బాధ్యతలు నిర్వహించారు. వీరందరికి నెలకు రూ.17,500 చొప్పున వేతనాలు చెల్లించే వారు. జీతాలను ఉద్యాన శాఖ బడ్జెట్‌నుంచి చెల్లించాల్సి ఉండగా, సరిపోను బడ్జెట్‌లేకపోవడం వల్ల వీరిని తప్పించారు. శాశ్వత పద్ధతిలో పని చేస్తున్న ఐదుగురు మాత్రమే మిగిలారు. ప్రస్తుతం ఉన్న ఉద్యాన అధికారులు ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు మండలాల బాధ్యతలను చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎప్పటికప్పుడు తోడ్పాటు అందిస్తాం...

సీజన్‌కు అనుగుణంగా ఉద్యాన పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు రైతులకు అందజేస్తాం. పొరుగు సేవల సిబ్బంది తొలగింపు ప్రభావం కొంతవరకు ఉంటుంది. దీనిని అధిగమించి ఇబ్బందులు రాకుండా చూస్తాం. ప్రభుత్వం అందించే రాయితీ పథకాలను అర్హులకు అందించేందుకు కృషి చేస్తాం.

- కమల, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారిణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.