ETV Bharat / state

ఆన్​లైన్ తరగతుల కోసం టీవీలు పంపిణీ చేసిన మంత్రి సబిత - today news MP Ranjith reddy

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్​లో గ్రామ పంచాయతీలకు చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సబితా రెడ్డి టీవీలను పంపిణీ చేశారు. విద్యార్థుల ఆన్​లైన్ తరగతులకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలకు టీవీలను అందచేస్తున్నారు.

ఆన్​లైన్ తరగతుల కోసం టీవీలను పంపిణీ చేసిన మంత్రి సబితా, ఎంపీ రంజిత్

author img

By

Published : Sep 13, 2020, 6:25 PM IST

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పంచాయతీలకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా టీవీలను పంపిణీ చేశారు. జిల్లాలో పేద విద్యార్థుల ఆన్​లైన్ తరగతులకు ఇబ్బంది కలగకూడదని టెలివిజన్​లు అందిస్తున్నట్లు ఎంపీ రంజీత్ రెడ్డి తెలిపారు. ప్రతి పంచాయితీలకు టీవీలు పంపిణీ చేయడం సంతోశకరమని రంజిత్​రెడ్డి పేర్కొన్నారు.

విద్యా సంవత్సరం నష్టపోకుండా..

విద్యా సంవత్సరం నష్టపోకుండా దూరదర్శన్ ద్వారా ఆన్​లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఫోన్​లు, టీవీలు లేని వారు గ్రామపంచాయతీలోని తరగతులకు హాజరు కావాలని సూచించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో నర్సరీ, వైకుంఠ ధామం, ట్రాక్టర్, డంపింగ్ యార్డుతో పాటు ఓ టీవీ కూడా ఉందని మంత్రి సబితా చెప్పుకొచ్చారు.

విద్య విలువ తెలిసిన వ్యక్తి...

చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి విద్యావంతుడు, విద్య విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని ప్రతి గ్రామానికి టీవీలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి సబితా ప్రశంసించారు.

ఇవీ చూడండి : ఎల్​ఆర్​ఎస్​కు భారీ సంఖ్యలో దరఖాస్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.