వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించారు. రేషన్ డీలర్లు దుకాణం ఎదుట ఎలాంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలంతా గుంపులు గుంపులుగా నిల్చున్నారు. ఉదయం నుంచి బయోమెట్రిక్ యంత్రంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల బియ్యం సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ఉదయం నుంచి బియ్యం కోసం వేచి చూసిన ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'ఆపరేషన్ కరోనా'పై సీఎంలకు మోదీ కీలక సూచనలు