బావిలో పడిన జింకను కాపాడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లిలో తెరాస నాయకుడు శుభప్రద్ పటేల్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో బావి ఉంది. అక్కడికి మేతకోసం వచ్చిన జింక ప్రమాదవశాత్తు బావిలో పడిందని ఆయన తెలిపారు.
ఇది గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు బావిలోని జింకను తాళ్ల సాయంతో బయటకు లాగారు. సురక్షితంగా తిరిగి అడవిలోకి వదిలినట్లు వారు వెల్లడించారు.
ఇదీ చదవండి: జూన్ 12న పాలీసెట్.. మే1- 22 వరకు దరఖాస్తుల స్వీకరణ