వికారాబాద్ జిల్లా తాండూరు పురపాలక సంఘంలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అధికార తెరాసకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనుచరులు... కార్యాలయ ఆవరణలో బాహాబాహికి దిగారు.
ఇవాళ నిర్వహించిన సాధారణ సమావేశంలో అజెండా అంశాలపై చర్చించకుండా ఆమోదించినట్లు ప్రకటించగా... ప్రతిపక్షసభ్యులు అభ్యంతరం తెలిపారు. సమావేశం నుంచి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వెళ్లిపోయారు. అనంతరం రెండు వర్గాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.
ఇదీ చూడండి: నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష