ETV Bharat / state

వ్యాపారిగా కంటే ప్రజా సేవకుడిగానే సంతృప్తి: చేవెళ్ల ఎంపీ

చేవెళ్ల నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులను ఎంపీ రంజిత్​ రెడ్డి వెల్లడించారు. వ్యాపారిగా కంటే ప్రజా సేవకుడిగానే తనకు ఎక్కువ సంతృప్తి కలిగిందన్నారు. కేటీఆర్​ ఆధ్వర్యంలో ఉద్యోగుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

వ్యాపారిగా కంటే ప్రజా సేవకుడిగానే సంతృప్తి: చేవెళ్ల ఎంపీ
వ్యాపారిగా కంటే ప్రజా సేవకుడిగానే సంతృప్తి: చేవెళ్ల ఎంపీ
author img

By

Published : May 23, 2020, 5:51 PM IST

వ్యాపారిగా కంటే ప్రజా సేవకుడిగానే తనకు ఎక్కువ తృప్తి కలిగిందని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఎన్నికై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను వెల్లడించిన రంజిత్ రెడ్డి.. రంగారెడ్డి జిల్లాలో ఐటీ రంగవిస్తరణకు తీవ్రంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంపీల్యాండ్ నిధులు లేకున్నా... ఇతర పథకాల కింద వచ్చే నిధులతో రంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రంజిత్ రెడ్డి వివరించారు.

"కేటీఆర్ ఆధ్వర్యంలో ఉద్యోగుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఫెడరల్ టైప్ గవర్నమెంట్ కావాలని తపించిన మోదీ.. ప్రధానమంత్రి అయ్యాక ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. భాజపా ఎంపీలు రాజకీయాలు కాదు.. రాష్ట్రానికి రావల్సిన నిధులపై ఆలోచించాలి. ఎంపీల్యాండ్ నిధులు లేకున్నా... ఇతర పథకాల కింద వచ్చే నిధులతో రంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాను."

-రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ

వ్యాపారిగా కంటే ప్రజా సేవకుడిగానే సంతృప్తి: చేవెళ్ల ఎంపీ

ఇదీ చూడండి: భారత 'జ్యోతి'కి ఇవాంకా ట్రంప్​ సలాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.