సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. తెప్పని జ్యోతి గత రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అసలేం జరిగిందంటే...
జ్యోతికి కొన్నేళ్ల క్రితం సైదులు అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కుటుంబ కలహాల వల్ల ఇరువురు 3 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ మధ్య విడాకులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. బాగా మనస్తాపానికి గురైన జ్యోతి అందరు నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. మృతురాలు గరిడేపల్లి మండలం కుతుబ్షాపురం గ్రామంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఆమె తండ్రి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడని అన్నారు. కొన్ని మనస్పర్థల కారణంగా విడాకుల దాగా వెళ్లి మనస్తాపానికి గురై అనంత లోకాలకు వెళ్లిందని స్థానికులు అంటున్నారు.
ఇదీ చూడండి: ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్