సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చామకూరి కలమ్మ అనే మహిళ రైతు అప్పుల బాధ తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తనకున్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి పంట సాగు చేసేందుకు తెలిసిన వారి వద్ద అప్పులు చేసింది.
పంట దిగుబడి సరిగా రాకపోవటం వల్ల మానసిక క్షోభకు గురైన ఆమె తన వ్యవసాయక్షేత్రం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలి భర్త పాపయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.