సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల జలాశయం నుంచి దేవాలయ రక్షణ కోసం నిర్మించిన కరకట్టకు పలు చోట్ల రంధ్రాలు పడి... అడుగు భాగం నుంచి ఊట వచ్చి సింహద్వారం జలమయమైంది. కార్తీక మాసం సందర్భంగా గురువారం రాత్రి ఆలయంలో బస చేసిన భక్తులు దీపారాధన చేసేందుకు నానా అవస్థలు పడ్డారు. మోటార్లతో నీరు తీస్తున్నా... ఇబ్బందులు తప్పడం లేదని భక్తులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ఇవీ చూడండి: పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకునే వార్త..