ETV Bharat / state

'కాంగ్రెస్​ కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది'

కాంగ్రెస్​ కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ ​రెడ్డి ఆరోపించారు. తెరాస ప్రభుత్వ హయాంలో తమ పార్టీ శ్రేణులపై దాడులు పెరిగాయని ధ్వజమెత్తారు. తాము రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటూ అక్రమ కేసులపై పోరాటం చేస్తామని తెలిపారు.

నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​
author img

By

Published : Jun 14, 2019, 11:45 PM IST

తెరాస ప్రభుత్వం కాంగ్రెస్​ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఇటీవల తమ్మారంలో హస్తం కార్యకర్తలపై బలమైన దాడులు జరిగాయని అన్నారు. గిరిజన వ్యక్తిని కొట్టి 40 రోజులైనా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. హుజూర్​నగర్​ నియోజకవర్గంలో కాంగ్రెస్​ శ్రేణులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

పోలీసులు కాంగ్రెస్​ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారన్నఎంపీ ఉత్తమ్​

ఇదీ చూడండి : 'బంగాల్​లో ఉండాలంటే బెంగాలీ నేర్చుకోవాల్సిందే'

Intro:సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టిపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి......

ఇటీవల తమ్మారం గ్రామం లో జరిగిన దాడులలో కాంగ్రెస్ కార్యకర్తలకు బలమైన గాయాలయ్యాయి కాంగ్రెస్ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారని క్షతగాత్రులు ఉత్తంకుమార్ రెడ్డి దగ్గర వాపోయారు 15 సంవత్సరాలలోపు ఉన్న విద్యార్థుల మీద కూడా కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారని ,గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త కనిపించిన వారిని తీసుకు వెళ్లి కేసులు పెట్టి భయాందోళనలకు గురిచేస్తున్నారు

బైట్.....

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.....

హుజూర్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసు వేధింపులు జరుగుతున్నాయని అక్రమంగా కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారని ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీసుల వేదింపులపై ఆందోళన చేపడతామని అన్నారు గిరిజన వ్యక్తిని కొట్టి 40 రోజులు అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఎద్దేవా చేశారు గొడవలతో సంబంధం లేని వ్యక్తుల పై అక్రమంగా కేసులు పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని , పికల నాయక తండ జరిగిన గొడవల్లో లకావత్ రామారావు మీద కూడా అక్రమంగా మూడు కేసులు పెట్టి జైలు పాలు చేశారని అన్నారు తమ్మారం నర్సిరెడ్డిని చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు నేను ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన ఇంత దౌర్భాగ్యం గా వ్యవహరించలేదని అన్నారు మేము న్యాయబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటామని అన్నారు అనంతరం చింతలపాలెం స్టేషన్కు వెళ్లి సీఐ ఎస్సైలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పై జరిగిన దాడి విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని న్యాయబద్ధంగా నడుచుకోవాలని సూచించారు

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా.... రమేష్

సెంటర్... హుజూర్నగర్

Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.