తెరాసకు మద్దతిచ్చే అంశాన్ని పార్టీలో చర్చించి నిర్ణయాయన్ని వెల్లడిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో మద్దతు కోరుతూ... తెరాస నేతలు కేకే, వినోద్, నామా నాగేశ్వరరావు సీపీఐ కార్యాలయానికి వెళ్లారు. తాము కమ్యూనిస్టులము కాకపోయినా... అదే ఆలోచనతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు రాజ్యసభ సభ్యుడు కేకే తెలిపారు. తమకు మద్దతునిచ్చే అంశంపై సీపీఐ సుముఖత వ్యక్తం చేస్తుందని ఆకాంక్షించారు. ఉపఎన్నికల్లో తెరాసకు మద్దతుపై అక్టోబర్ 1న తమ నిర్ణయం చెబుతామని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: డిసెంబర్ 20నుంచి సీపీఐ రాష్ట్ర నిర్మాణ సభలు