రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకవీడు మండల పరిధిలోని పలు చెరువులు నిండి.. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని గుండెబోయిన గ్రామంలోని వాగు మీద నిర్మించిన బ్రిడ్జి వరద ప్రవాహానికి కూలిపోవడం వల్ల ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ బ్రిడ్జి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంగా కుంగిపోయింది. వంతెన కూలిపోవడం వల్ల ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందిగా ఉందని.. ప్రభుత్వం స్పందించి పిల్లర్లు వేసి.. బ్రిడ్జి బలంగా నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామం కావడం వల్ల అత్యవసర సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోందని గ్రామస్థులు వాపోతున్నారు.
ఇవీచూడండి: సచివాలయ టెండర్ల దాఖలు గడువు పొడిగింపు