ETV Bharat / state

పద్మావతి గెలవకపోతే ఏ శిక్షకైనా సిద్ధమే..: ఉత్తమ్

author img

By

Published : Sep 30, 2019, 9:12 PM IST

Updated : Sep 30, 2019, 9:34 PM IST

పోలీసులను అడ్డుపెట్టుకుని తెరాస గెలవాలని ప్రయత్నిస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమ అభ్యర్థి పద్మావతి రెడ్డి 30వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

UTTAM KUMAR REDDY
'పద్మావతిని ఓడించడానికి 700 మంది తెరాస వాళ్లు వచ్చారు'

హుజూర్​నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డిని ఓడించడానికి 700 మంది తెరాస వాళ్లు వచ్చారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​ రెడ్డి అన్నారు. పద్మావతి రెడ్డి 30వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గెలవక పోతే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పారు. హుజూర్​నగర్​లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తన కృషి వల్లే హుజూర్​నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని తెలిపారు. దేశంలో ఏ నియోజకవర్గానికి దక్కని నిధులు హుజూర్‌నగర్‌కు తెచ్చానని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి నామినేషన్

Last Updated : Sep 30, 2019, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.