సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రూ.40 లక్షల వ్యయంతో అదనపు గదుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల పనులు ప్రారంభించడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. విద్యార్థులు చదువులో రాణించి.. భవిష్యత్తులో గొప్ప శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నానన్నారు.
ఓవైపు కరోనా విజృంభిస్తున్నా అభివృద్ధి పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సైదిరెడ్డి పేర్కొన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తూ.. పెట్టుబడి సాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1278 కేసులు.. మరో 8 మంది మృతి