ETV Bharat / state

అజరామరం: కల్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పించిన 'తెలంగాణం' - కల్నల్ సంతోశ్​ బాబు తాజా వార్తలు

దేశం కోసం కొనసాగిన పోరాటంలో వీర మరణం పొందిన భారత జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని పలువురు ఘన నివాళులు అర్పించారు. కల్నల్ సంతోష్​ బాబు కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Solid tribute to Santosh Babu
కల్నల్ సంతోశ్​ బాబుకు ఘన నివాళులు
author img

By

Published : Jun 18, 2020, 6:15 AM IST

భారత్‌-చైనా సరిహద్దులో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కొల్పోయిన వీరజవాన్లకు వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు నివాళులు అర్పించాయి. కల్నల్ సంతోష్​ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనాతో ప్రపంచం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే చైనా తన మీద ఉన్న అపవాదులను పక్కదారి పట్టించేందుకు సరిహద్దుల్లో హడావుడి సృష్టిస్తుందని విమర్శించారు. భారత్‌పై కుట్రలు ఆపి.. కరోనాకు మందును కనిపెట్టేందుకు కృషి చేయాలని హితవు పలికారు.

యువజన సంఘం ఆధ్వర్యంలో

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో మహి మెమోరియల్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో నామ సుభద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యాదాద్రిలో భాజపా నాయకులు అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

కొవ్వొత్తులతో

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో కాంగ్రెస్‌ నాయకులు సంతోశ్​ ‌బాబు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మిర్యాలగూడలో అమరవీరుల స్తూపం వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. హుజూర్​ నగర్ శాంతి స్తూపం వద్ద ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. కరీంనగర్‌ గీతాభవన్‌ వద్ద కలెక్టర్ శశాంక... సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం ప్రకటించారు. భువనగిరికి చెందిన కళాకారుడు ఉప్పుతో సంతోష్​బాబు చిత్రాన్ని తీర్చిదిద్దారు.

ఆఫీస్ ముందు

హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్‌ వద్ద కాంగ్రెస్ నాయకులు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. సైనికుల త్యాగాలు ప్రజలు మరిచిపోలేరని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. టీఎస్​ఆర్​టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ ముందు సీసీఎస్​ కార్యాలయం ఆవరణలో సంతోష్​ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

తీవ్రర్ణ పతాకంతో

ఆసిఫాబాద్ గాంధీ చౌక్‌ వద్ద భాజపా నాయకులు కొవ్వత్తులు వెలిగించి నివాళి అర్పించారు. కరీంనగర్ చొప్పదండి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కల్నల్ సంతోశ్​బాబుకు సంతాపం ప్రకటించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్​లో వివేకానంద యూత్ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు క్యాండిల్స్ ర్యాలీ చేశారు. ఖమ్మంలో వైబ్రేంట్స్‌ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో 100 మీటర్ల పొడవైన తీవ్రర్ణ పతాకంతో ర్యాలీ తీశారు.

ఇదీ చూడండి : ఏషియన్​ పెయింట్స్​ పరిశ్రమలో కార్మికుడికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.