సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం బాలాజీనగర్‌లో ఏర్పాటు చేసిన 350 లీటర్ల శానిటేషన్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. వార్డులోకి ప్రవేశించే ముందు చేతులు, కాళ్లు కడుక్కునే విధంగా ప్రవేశ ద్వారం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. శానిటైజర్‌తో శుభ్రపరుచుకుని వార్డు లోపలికి రావడం వల్ల కరోనాను కొంతమేర అరికట్టవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీహార్‌కు చెందిన వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఇవీచూడండి: 'మిమ్మల్ని ఎప్పుడో క్వారంటైన్లో పెట్టారు... అయినా మీలో మార్పులేదు'