ETV Bharat / state

పోరాటం హుజూర్​నగర్​ నుంచే మొదలవ్వాలి: రేవంత్​ - congress campaign in huzurnagar by elections

తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం హుజూర్​నగర్​ నుంచే ప్రారంభం కావాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడులో ప్రచారం చేశారు.

రేవంత్​ రెడ్డి
author img

By

Published : Oct 18, 2019, 6:06 PM IST

సూర్యాపేట జిల్లా పాలకవీడులో మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి ప్రచారం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం హుజూర్​న​గర్ నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నాటి నిజాం నవాబును గుర్తుచేసేలా కేసీఆర్ పరిపాలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో సబ్బండ వర్గాలను మోసం చేస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

పోరాటం హుజూర్​నగర్​ నుంచే మొదలవ్వాలి: రేవంత్​

ఇవీ చూడండి : చరిత్రే చిన్నబోతోంది... ఆ రణభూమికి ఇప్పుడేమైంది!?

Intro: ఈ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు జరుగుతున్న ఎన్నిక:::రేవంత్ రెడ్డి

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి ప్రచారం ముమ్మరంగా జరిగింది..ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు... ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించాలేని సన్నాసి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరమని ప్రభుత్వాన్ని విమర్శించాడు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం హుజుర్నగర్ నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆనాటి నిజాం నవాబును గుర్తుచేస్తూ కేసీఆర్ పాలన సాగిస్తున్నాడు అని అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలను మోసం చేస్తూ నిరంకుశ పాలన చేస్తున్నాడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశాడు.టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అన్న కేసీఆర్ అభివృద్ధి చేయకపోగా నిరంకుశ పాలన సాగిస్తున్నాడు. సాయుధ పోరాటం చేసిన నల్లగొండ గడ్డ కేసీఆర్ పతనానికి నాంది పలకాలని పిలుపునిచ్చాడు. తెలుగుదేశం పార్టీ నా కుటుంబంతో సమానం అని తెలుగుదేశం పార్టీ ఓటర్లు కూడా కాంగ్రెస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు....

Body:కెమెరా అండ్ రెపోర్టింగ్:::వాసు
సెంటర్::::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్::9502802407
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.