ETV Bharat / state

pulichinthala: పులిచింతల ఘటన.. నిర్మాణ లోపాలే ప్రధాన కారణాలు

author img

By

Published : Aug 6, 2021, 4:56 AM IST

Updated : Aug 6, 2021, 5:10 AM IST

కృష్ణాపరివాహకంలో దిగువన కీలకమైన ప్రాజెక్టు పులిచింతల డిజైన్‌ దగ్గర నుంచి పనుల పూర్తి వరకూ అన్నింటా సమస్యలే. తొలుత 33 గేట్లు అమర్చుదామనుకున్నా ఈపీసీ సాకుచూపి 24 గేట్లతోనే సరిపెట్టారు. కాంక్రీటు డ్యాంకు బదులు మట్టికట్టతోనే సరిపెట్టారనే విమర్శలూ లేకపోలేదు. గేట్ల మధ్య పెరిగిన దూరం సహా నిర్మాణంలోని పలు లోపాలు ప్రస్తుత ఘటనకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

pulichinthala project gate
పులిచింతల ఘటన

పులిచింతల నిర్మాణంలో ఆది నుంచీ లోపాలే కనిపిస్తున్నాయి. డిజైన్‌ ఖరారు మొదలుకొని పనుల వరకూ అన్నింటిలోనూ సమస్యలే. ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిపుణుల కమిటీ లోపాలను ఎత్తిచూపినా నీటి పారుదలశాఖ చూసీచూడనట్లు వ్యవహరించింది. బయటపడ్డ లోపాలను సవరించే ప్రయత్నం చేయకపోవడంతో కొత్త ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగానే గేటుకు నష్టం వాటిల్లింది. నిల్వ చేసిన విలువైన నీటిని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. నీటి పారుదలశాఖ సమాచారం ప్రకారం పులిచింతలలో 24 గేట్లను అమర్చారు. ఒక గేటుకు ఇంకో గేటుకు పొంతన లేదన్నది నిపుణుల అభిప్రాయం. గేట్లను అమర్చడానికి నిర్మించే పియర్స్‌లో ఒక గేటుకు, ఇంకో గేటుకు మధ్య గ్యాప్‌ గరిష్ఠంగా ఆరు మిల్లీమీటర్లకు మించి ఉండరాదని, కానీ పులిచింతలలో 400 మిల్లీమీటర్లకు పైగా ఉందని పనులను పరిశీలించిన నిపుణుడొకరు తెలిపారు.

పులిచింతల ఘటన

పియర్స్‌ మధ్య తేడా ప్రభావం గేట్ల మీద పడిందని, ఒక పియర్‌కు ఇంకో పియర్‌కు మధ్య ఎడం మాత్రమే కాదు, పియర్స్‌లో తేడాలను గుర్తించినట్లు నిపుణులు తేల్చారు. కాంక్రీటు నాణ్యత, మెకానికల్‌ పనుల అలైన్‌మెంట్‌.. ఇలా అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించాలని’ ఓ సీనియర్‌ ఇంజినీరు వ్యాఖ్యానించారు. డ్యాంలో ఐదారు మీటర్ల నీళ్లు నింపగానే సీపేజీ ప్రారంభమై గ్యాలరీ నిండా నీళ్లే. పది మీటర్ల వరకూ నింపితే అక్కడివరకూ గ్యాలరీ నిండిపోయిందని గతంలో ప్రాజెక్టు అధికారిగా వ్యవహరించిన ఓ ఇంజినీరు తెలిపారు. గ్రౌటింగ్‌ చేయకపోవడం వల్లే సమస్య తలెత్తినట్లు గుర్తించి ప్రభుత్వ అనుమతితో తర్వాత పనులు చేశారు. జరిగిన ఘటన ఆశ్చర్యకరం కాదని, ఊహించినదేనని ఇప్పటికైనా అన్ని గేట్లనూ నిశితంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఓ సీనియర్‌ ఇంజినీరు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుపై అధ్యయనం చేసి సాగునీటిరంగ నిపుణులిచ్చిన నివేదిక బుట్టదాఖలైంది.

ఆరంభంలోనే 45.77 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి 2004లో శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌-సీఆర్‌18జీ సంస్థతో ఈపీసీ పద్ధతిలో అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పర్యావరణ అనుమతి ఆలస్యం కావడంతో 2005 జూన్‌లో పని ప్రారంభమైంది. ఒప్పందం ప్రకారం 1289 మీటర్ల కాంక్రీటు డ్యాంతో పాటు 33 గేట్లు బిగించాల్సి ఉంది. ఈపీసీ పేరుతో డ్యాం డిజైన్‌ మార్చి స్పిల్‌వేను 546 మీటర్లకు కుదించి గేట్ల సంఖ్య 24కు తగ్గింది. కాంక్రీటు డ్యాం బదులు 355 మీటర్ల మట్టికట్ట నిర్మాణం చేపట్టారు. కాంక్రీటు డ్యాంకు ఒప్పందం చేసుకుని మట్టికట్ట నిర్మించడాన్ని 2006 ఫిబ్రవరి 11న ‘కాంక్రీటు పోయి మట్టి వచ్చే డ్యాం..డ్యాం..డ్యాం ’శీర్షికన ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. నీటి పారుదలశాఖ నిర్ణయాన్ని అప్పటి పెద్దలు సమర్థించుకున్నా చివరకు ఒత్తిడికి తలొగ్గి స్పిల్‌వేను తగ్గించి 24 గేట్లతోనే నిర్మించింది.

ఇదీ చూడండి:

PULICHINTALA: 'తాత్కాలిక గేటు ఏర్పాటుకు 24 గంటలకు పైగా సమయం'

Pulichinthala: ఊడిపోయిన గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృథా

Last Updated : Aug 6, 2021, 5:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.