ఎగువన కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. జలాశయంలోకి భారీ ఎత్తున నీరు వచ్చి చేరుతుండగా అధికారులు 14 క్రస్టు గేట్లను ఎత్తి మూడు అడుగుల మేర నీటికి దిగువకు వదులుతున్నారు. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 174 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 44.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 3,68,208 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా పులిచింతల ప్రాజెక్టులోని 14 గేట్ల ద్వారా 3,53,948 క్యూసెక్కుల నీటిని అధికారులు కృష్ణానదిలోకి వదిలుతున్నారు.
ఇదీ చదవండి: వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా