ETV Bharat / state

మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నపెద్ద గట్టు జాతర - telangana news today

సూర్యాపేటలో పెద్దగట్టు జాతర మరికొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. దేవరపెట్టె ఈ అర్థరాత్రి కేసారం నుంచి బయలుదేరనుంది. గంపల ప్రదర్శన, ముద్రపోలు అనంతరం అధికారికంగా జాతర మొదలుపెడతారు.

peddagattu-jatara-will-start-on-monday-at-suryapet
మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నపెద్ద గట్టు జాతర
author img

By

Published : Feb 28, 2021, 7:35 PM IST

Updated : Feb 28, 2021, 8:18 PM IST

సూర్యాపేటలో పెద్దగట్టు జాతర ప్రారంభం కానుంది. అమ్మవారి దేవరపెట్టే ఈ అర్థరాత్రి కేసారం నుంచి బయలుదేరి తెల్లవారుజామున గుట్టపైకి చేరుకుంటుంది. గంపల ప్రదర్శన, ప్రత్యేక పూజలైన ముద్రపోలు నిర్వహించిన అనంతరం... జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది.

5 రోజుల పాటు సందడి

మేడారం సమ్మక్క సారలమ్మ తరహాలోనే ఇక్కడా రెండేళ్లకోసారి ఉత్సవాలు జరుగుతాయి. దురాజ్‌పల్లి గుట్టపైకి దేవుళ్ల విగ్రహాలున్న దేవరపెట్టెను పల్లకిలో తీసుకురావడం, పొట్టేళ్లను బలి ఇవ్వడం, బోనం సమర్పించడం... ఇలా అత్యంత వైభవంగా జరిగే పెద్దగట్టు జాతర మార్చి 4 వరకూ అయిదు రోజులపాటు జరగనుంది. యాదవుల ఇలవేల్పుగా భావించే లింగమంతుల స్వామిని కొలిచి, శివుడి సోదరిగా-కుమార్తెగా భావించే చౌడమ్మ తల్లికి మాంసాహారాన్ని నివేదించడమే ఈ జాతర విశిష్టత.

జాతీయ రహదారిపై వాహనాల మళ్లింపు

ఈ వేడుకల్ని తిలకించేందుకు భక్తులు తరలివస్తున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా విజయవాడకు వెళ్లే వాహనాలను... నల్గొండ జిల్లా నార్కట్​పల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి వెళ్లే వాటిని... కోదాడ, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా తరలిస్తున్నారు.

ఇదీ చూడండి : అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

Last Updated : Feb 28, 2021, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.