పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోబోతున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఇది జరగనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. పీసీసీ బాధ్యతల వల్ల సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపాయనని వివరించారు. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలపై హుజూర్నగర్ భేటీలో పాల్గొన్న ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

ఇవీ చూడండి: తెలంగాణ నూతన సీఎస్‌గా సోమేశ్ కుమార్