ETV Bharat / state

ఈ సర్కారు బడికి నో-అడ్మిషన్ బోర్డు పెట్టేశారు

author img

By

Published : Jul 21, 2019, 3:12 PM IST

అత్యధిక అడ్మిషన్లు ఉన్న పాఠశాలగా గుర్తింపు సొంతం. కేవలం ఐదో తరగతి వరకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పాఠశాలలో 500 మంది విద్యార్థులు. మరింత మంది చేరేందుకు వస్తుంటే... అధికారులు అడ్మిషన్లు లేవు అని బోర్డు పెట్టేశారు. కారణం సరిపడా సిబ్బంది, మౌళిక సదుపాయాలు లేకపోవడమే.

ఈ సర్కారు బడికి నో-అడ్మిషన్ బోర్డు పెట్టేశారు
ఈ సర్కారు బడికి నో-అడ్మిషన్ బోర్డు పెట్టేశారు

విద్యార్థులు చేరక, ఉపాధ్యాయులు లేక, సౌకర్యాలు కరవై, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టక... ఇలా అనేక కారణాలతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గురవుతున్నాయి. ఇందులో పిల్లలు చేరకపోవడం ప్రధాన కారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఎన్​ఎస్పీ క్యాంపు పాఠశాల ముందు నో-అడ్మిషన్ బోర్డు వెలసింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధిస్తున్న ఈ పాఠశాలలో ఇప్పటికే 500 మంది విద్యార్థులున్నారు. అయినప్పటికీ మరింత మంది విద్యార్థులు చేరేందుకు వస్తున్నారు. కానీ సరిపడా సిబ్బంది, తరగతి గతులు లేక నో-అడ్మిషన్ బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రధానోపాధ్యాయుడు యతిపతిరావు తెలిపారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్యాంపులో పనిచేసే ఆఫీసర్ల పిల్లల కోసం 1968లో ఈ బడిని ప్రారంభించారు. అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చి కొన్నేళ్లు నడిపారు. 1986లో ప్రైమరీ స్కూల్​గా మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నత వర్గాల నుంచి సాధారణ స్థాయి వరకు అందరి పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. 2000 సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం కోసం చాలామంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. దాదాపు 500కు పైగా ఉన్న విద్యార్థుల సంఖ్య 144కు చేరుకుంది.

2011వ సంవత్సరంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా యతిపతిరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన చొరవతో పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. 2013లో ఆంగ్లమాధ్యమం ప్రారంభించి విద్యార్థుల సంఖ్యను 250 చేశారు. ప్రస్తుతం 2019 - 2020 విద్యా సంవత్సరానికిగాను కొత్తగా వచ్చిన 140 మందితో కలిపి 500 మంది విద్యార్థులయ్యారు. ఇక్కడ చదువుకుంటున్న చాలా మంది విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపికవుతున్నారు. విద్యాభోధన బాగుండడం వల్ల విద్యార్థుల తాకిడి పెరుగుతోంది.

ప్రస్తుతం ఉన్న గదులు సరిపోకపోవడం వల్ల చెట్ల కిందే పాఠాలు చెప్పాల్సి వస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అదనపు తరగతి గదులు, మూత్రశాలలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జిల్లాలో ఈ పాఠశాల ఇప్పుడు ఆదర్శంగా మారింది.

ఇవీ చూడండి: 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలె తల్లీ'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.