ఉత్కంఠభరిత హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో ఓట్లు నోట్ల బాట పట్టాయి. శనివారం సాయంత్రం ప్రచారం ముగిసినందున కరెన్సీ మూటలతో రాజకీయ పార్టీలు తుది అస్త్రాలు సంధిస్తున్నాయి. ఓటుకు వెయ్యి రూపాయలు పంచుతున్నారు. కొన్ని కీలక ప్రాంతాల్లో రెండు వేలు ఇచ్చేందుకూ వెనకాడటం లేదు. ఎన్నికల సంఘం డేగ కళ్లతో ప్రత్యేక పరిశీలన చేపడుతున్నా.. పార్టీలు మద్యం, డబ్బు పంపిణీ వ్యూహాలు సమర్థంగా అమలు చేస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా అంతటా కోడ్ అమలులో ఉంది. ఇప్పటికే అధికారులు 84లక్షల 59వేలకు పైగా నగదు, 16వేల లీటర్లకు పైగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: స్తంభించిన రాకపోకలు... విపక్షనేతల అరెస్ట్