హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూర్యాపేట జిల్లా మఠంపల్లి రెవెన్యూ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. నియోజకవర్గంలో ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకుని అభివృద్ధికి బాటలు వేసే అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని సైదిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండా నాయక్, జడ్పీటీసీ జగన్ నాయక్, మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మన్నెం శ్రీనివాస్ రెడ్డి, హుజూర్నగర్ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, తెరాస నేతలు పాల్గొన్నారు.