సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పర్యటించారు. మున్సిపాలిటీ ఛైర్మన్ రజిని, మున్సిపల్ కమిషనర్ ఉమేష్ చంద్రతో కలిసి 3,4 వార్డులలో పర్యటించి... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీలు సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుకుంటున్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. పల్లె ప్రగతి ఫలితాలను ఆస్వాదిస్తూ... పట్టణ ప్రగతిలో ప్రజా ప్రతినిధులందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.